హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఏడున్నర శాతం మేర ఆస్తుల విలువ పెరుగుతాయని అంచనా వేసింది. గత నెల 11-27 మధ్య కాలంలో పదమూడు మంది ఆస్తి విశ్లేషకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రానున్న రెండు సంవత్సరాల్లో సగటు ఇండ్ల ధరలు ఆరు శాతం పెరుగుతాయని అంచనా వేశారు. ఢిల్లీతోపాటు ముంబైలలో ధరలు వచ్చే ఏడాది నాలుగు నుంచి ఐదు శాతం మేర పెరుగుతాయని అంచనా. బెంగళూరు, చెన్నైల్లో ధరలు 5.5-6.5 శాతం పెరుగుతాయని విశ్లేషించింది. ఇందుకు ప్రధాన కారణం… నిర్మాణ సామగ్రి స్టీలు, సిమెంట్ ధరలు గణనీయంగా పెరగడమే.