న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు లాజిస్టిక్, డెలివరీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సీజన్లో ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో వేగవంతంగా డెలివరీ చేయడానికి 650 కొత్త లాజిస్టిక్ పార్క్‌లను సైతం నెలకొల్పింది. వీరిలో 10 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండగా, అలాగే వికలాంగులను సైతం తీసుకోనున్నది.