ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు బోలేడు. వచ్చేది పండుగ సీజన్ కావడంతో కొత్తగా 2.16 లక్షల మందికి సీజనల్ జాబ్స్ లభించనున్నాయని ఓ సర్వే వెల్లడించింది.