Renault Duster | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన కంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ (Duster) మోడల్ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. రెనాల్ట్ గ్లోబల్ మోడల్ కార్లు సాండెరో (Sandero), లొగాన్ (Logan) మోడల్ కార్ల మాదిరిగా 2024 డస్టర్ కంపెనీ సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. భారత్ మోడల్ రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పూర్తిగా లోకల్ పరిస్థితులతోపాటు ఇతర కార్లతో పోటీ పడుతుంది. కొత్త డస్టర్ కారులో ప్యాసింజర్లకూ, లగేజీ రూమ్‌కూ మరింత స్పేస్ కల్పిస్తుంది. పాత మోడల్ కారు కంటే కొత్త డస్టర్ (Duster) కారు పొడవుగా ఉంటుంది. 4340 మిమీ పొడవు, వీల్ బేస్ 2657 ఎంఎం కలిగి ఉంటుంది. న్యూ రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఐదు డ్రైవింగ్ మోడ్స్ (ఆటో, స్నో, మడ్/ శాండ్, ఆఫ్ రోడ్, ఎకో)తోపాటు 4×4 టెరైన్ కంట్రోల్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
గ్లోబల్ మోడల్ డస్టర్ వై-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీ డిజైన్డ్ బంపర్ విత్ వెర్టికల్ ఎయిర్ వెంట్స్, ఇంటిగ్రేటెడ్ రౌండ్ ఫాగ్ లాంప్స్, రేర్ లో వై-షేప్డ్ టెయిల్ లైట్స్, రివైజ్డ్ బంపర్ ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో 2024 డస్టర్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.6 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ టూ ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 140 బీహెచ్పీ విద్యుత్, 148 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 24.5 కి.మీ మైలేజీ ఇస్తుంది. 1.2 కిలోవాట్ల బ్యాటరీ యూనిట్ ఉంటుంది. బ్రేక్ రీజనరేషన్‌తో బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్‌తో ఇంజిన్ స్టార్టవుతుంది.
మిల్లర్ సైకిల్‌పై 1.2 లీటర్ల – 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ విత్ 48వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ తో నడుస్తుందీ ఇంజిన్. భారత్ లోనూ ఇదే ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో ఎల్పీజీ – పెట్రోల్ వర్షన్ ఇంజిన్ కూడా ఉంటుంది. పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ ట్యాంకుల్లో 50 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. అయితే, భారత్ మార్కెట్లో ఈ ఇంజిన్ తో రెనాల్ట్ డస్టర్ – 2025 మోడల్ కారు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక 2025 రెనాల్ట్ డస్టర్ కారు 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.1 అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆర్కామిస్ 3డీ సౌండ్ సిస్టమ్, రియల్ టైం ట్రాఫిక్ డేటాతో నేవిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆల్ 4- డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, 6-స్పీకర్ ఆర్కామిస్ 3డీ సౌండ్ సిస్టమ్ ఉంటాయి. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ తదితర కార్లకు 2025 రెనాల్ట్ డస్టర్ కారు గట్టి పోటీ ఇవ్వనున్నది.