Reliance | రేపు రిలయన్స్ ఏజీఎం భేటీ.. వీఆర్తోపాటు వాటిల్లో లైవ్ స్ట్రీమ్
Reliance | రిలయన్స్ వాటాదారుల 45వ వార్షిక సమావేశం వీఆర్ ప్లాట్‌ఫామ్‌తోపాటు 5 సోషల్ మీడియా వేదికలపై లైవ్ స్ట్రీమ్ అవుతుంది.
Reliance | ఇన్వెస్టర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ వాటాదారుల 45వ వార్షిక సమావేశం సోమవారం జరుగనున్నది. వాటాదారులను డిజిటల్‌గా కనెక్ట్ చేయడానికి వర్చువల్ రియాల్టీ ప్లాట్‌ఫామ్‌తోపాటు ఐదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై లైవ్ స్ట్రీమ్ ప్రసారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం జరిగే ఏజీఎంలో రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముకేశ్ అంబానీ వర్చువల్‌గా వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక కార్పొరేట్ సంస్థ వార్షిక సమావేశం జియోమీట్ బ్రాడ్కాస్ట్తోపాటు అదనంగా ఐదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై లీవ్ స్ట్రీమ్ కావడం ఇదే తొలిసారి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన ముఖ్యాంశాలను తెలిపేందుకు రిలయన్స్ ఏజీఎం వర్చువల్ రియాల్టీ (వీఆర్) ప్లాట్‌ఫామ్‌ను జీమెట్రీ డిజైన్ చేసింది. డిజిటల్ వీక్షకుల కోసం కూ (Koo), ఇన్స్టాగ్రామ్ (Instagram)ల్లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు యూ-ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లపై రిలయన్స్ ఏజీఎం లైవ్ స్ట్రీమ్ మొదలవుతుంది.
వాట్సాప్‌లో కనెక్ట్ కావడానికి రిలయన్స్ తన వాట్సాప్ చాట్‌బోట్ 7977111111 యాక్టివేట్ చేసింది. ఈ చాట్‌బోట్‌లో `hi` అని మెసేజ్ పంపితే ఏజీఎం తేదీ, ప్రారంభ సమయం తదితర వివరాలు తెలుస్తాయి. లైవ్‌లో ఎలా వీక్షించాలి, వాటాదారు ప్రశ్నలు వేయడానికి చాట్‌బోట్ ఉపకరిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

