Reliance Jio | గత జూలైలో భారీగా టారిఫ్ చార్జీలు పెంచిన దేశీయ టెలికం సంస్థలు రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్.. తాజాగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా న్యూఇయర్ వెల్కం ప్లాన్ తెచ్చింది రిలయన్స్ జియో. కేవలం జియో యూజర్ల కోసం ఎక్స్క్లూజివ్ బెనిఫిట్లు కల్పిస్తూ తీసుకొచ్చింది. పార్టనర్ డిస్కౌంట్స్ తోపాటు ఖర్చు తక్కువతో కనెక్టివిటీ అవకాశం కల్పిస్తోంది. 2025 ప్రారంభం నేపథ్యంలో రూ.2,025 రీచార్జి ప్లాన్ తెచ్చింది. దీర్ఘకాలిక యూజర్లకు ఆకర్షణీయ ప్లాన్ ఇది. నెలవారీగా రూ.349 రీచార్జీ ప్లాన్ కు సమానం కాగా, రూ.468 పొదుపు చేయొచ్చు. ఈ నెల 11 నుంచి జనవరి 11 వరకూ ఈ ‘న్యూ ఇయర్ ప్లాన్ వెల్కం ప్లాన్’ లభ్యం అవుతుంది.
రూ.2,025 ప్లాన్ కింద నిరంతరాయంగా అన్ లిమిటెడ్ 5జీ సేవల కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి రోజూ 2.5 జీబీ డేటా చొప్పున 500 జీబీ (4జీ) డేటా, 200 రోజుల వరకూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. షాపింగ్, డైనింగ్, ప్రయాణ సమయంలో రూ.2150 విలువ గల పార్టనర్ కూపన్లు లభిస్తాయి. రూ.2500 విలువ గల షాపింగ్ లావాదేవీ నిర్వహిస్తే రూ.500 విలువైన జియో కూపన్, రూ.499 అంతకంటే ఎక్కువ విలువ గల స్విగ్గీ ఆర్డర్ మీద రూ.150 తగ్గింపు, ఈజీ మై ట్రిప్ డాట్ కామ్ ద్వారా విమాన టికెట్ ధర బుక్ చేసుకుంటే రూ.1500 రాయితీ లభిస్తుంది.