ముంబై, నవంబర్ 28: పండుగ సీజన్ పూర్తికావడంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ సరికొత్తగా బ్లాక్ ఫ్రైడే విక్రయాలు ఆరంభించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులు(ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్) కొనుగోళ్లపై రూ.10 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు కన్జ్యూమర్ డ్యూరబుల్పై రూ. 22,500 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది.
ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉండనున్నది.