ముంబై, జనవరి 23: గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్..మరోసారి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారులు రూ.26 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌తోపాటు www.reliancedigital.in లో కూడా పొందవచ్చునని సూచించింది. స్టోర్‌లో షాపింగ్ చేసేవారు పలు రకాల ఫైనాన్స్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్‌పై రూ.26 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. అలాగే యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపి యాక్సెస్సిరీస్, చిన్న పరికరాలను కొనుగోలు చేసిన వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ లభించనున్నది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 26 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. రూ.26,999 ప్రారంభ ధరతో ల్యాప్‌టాప్‌లు, రూ.59,990 ధరతో 4కే యూహెచ్డీ టీవీ, 55 ఇంచుల టీవీ రూ.27,990ని కేవలం రూ.1,990 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.