Redmi 14C | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెడ్మీ 13సీ (Redmi 13C) ఫోన్ కొనసాగింపుగా రెడ్మీ 14సీ (Redmi 14C) వస్తోంది. ఈ ఫోన్ 6.88 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా ఉంటాయి. ఈ నెల 31న భారత్ మార్కెట్లోకి రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ రానున్నది. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని తెలుస్తున్నది. రెడ్మీ 13సీ (Redmi 13C) ఫోన్ లో మాదిరిగానే ఎల్ఈడీ ఫ్లాష్‌తో రేర్‌లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో డ్యుయల్ కెమెరాలు ఉంటాయి.
రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.88 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే విత్ హెచ్డీ + రిజొల్యూషన్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరాలో ఏఐ బ్యాక్డ్ ఫీచర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ అండ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ వస్తోంది. గతేడాది డిసెంబర్ లో భారత్ మార్కెట్లోకి ఎంటరైన రెడ్మీ 13సీ (Redmi 13C) ఫోన్ రూ.7,999 నుంచి ప్రారంభమైంది. తాజాగా రానున్న రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ ధర కూడా అంతే ఉంటుందని భావిస్తున్నారు.