Redmi 13 5G : భారత్ మార్కెట్లోకి రెడ్మి 13 5జీ బుధవారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ రెడ్మి ఫోన్ రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచ్ డిస్ప్లే, 120హెచ్జడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. రెడ్మి 12 5జీకి కొనసాగింపుగా రెడ్మి 13 5జీ రూ. 15,000లోపు మెరుగైన స్మార్ట్‌ఫోన్ కోరుకునే కస్టమర్లను ఆకట్టుకునేలా అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ముందుకొచ్చింది.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్‌తో రెడ్మి 13 5జీ షియామి లేటెస్ట్ హైపర్ఓఎస్పై రన్ అవుతుంది. వనిల్లా మోడల్‌తో కూడిన రెడ్మి 13 5జీ ఎంట్రీలెవెల్ ఫోన్ రూ. 13,999కి లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.రెండు వేరియంట్లలో ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
ఇక రెడ్మి 13 5జీ 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5030ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెన్సర్‌తో పాటు సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బడ్జెట్లో మెరుగైన స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి ఇది మెరుగైన ఎంపికని కంపెనీ తెలిపింది. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో బడ్జెట్ క్యాటగిరీ కస్టమర్లకు ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైనదని పేర్కొంది.
Read More :
Stock Market Close | లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..!