న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : గత నెల సెప్టెంబర్లో క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు రికార్డు స్థాయిని తాకుతూ రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు నెల ఆగస్టుతో పోల్చితే 14 శాతం పెరిగాయి.
పండుగల సీజన్.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు కలిసొచ్చిందన్న అభిప్రాయాలు తాజా గణాంకాలతో వ్యక్తమవుతున్నాయి. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డు వినియోగదారుల వాటా కొనుగోళ్లలో అత్యధికంగా ఉన్నది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.