e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News రియల్‌ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌

రియల్‌ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌

రియల్‌ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌

స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచంలో రియల్‌ మీ సంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి వినియోగదారులకు ఫేవరేట్‌ బ్రాండ్‌ గా మారిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్‌ గా  చౌకధరలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ని రిలీజ్‌ చేసింది. రియల్‌ మీ 8 సిరీస్‌ లో  5జీని రెండు వేరియంట్లలో తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లలో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ధర చాలా తక్కువ. కేవలం రూ.15,000 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. రియల్‌మీ 8 5జీ సేల్ ఏప్రిల్ 28 మధ్యాహ్నం 12 గంలకు మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌, ఆఫ్‌ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మీ 8 5జీ ఫీచర్స్‌  :
డిస్‌ప్లే: 6.5 అంగుళాల IPS LCD, 90Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 4 GB, 8 GB
ఇంటర్నల్ స్టోరేజ్: 128 GB
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
రియర్ కెమెరా: 48 MP + 2 MP + 2 MP
ఫ్రంట్ కెమెరా: 16 MP
బ్యాటరీ: 5000 mAh (18W క్విక్ ఛార్జ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ 2.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: సూపర్‌ సోనిక్ బ్లూ, సూపర్‌సోనిక్ బ్లాక్
ధర: 4 GB +128 GB – రూ.14,999
        8 GB +128 GB – రూ.16,999

ఇండియన్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్‌లో కూడా రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది.

Advertisement
రియల్‌ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement