న్యూఢిల్లీ, జనవరి 10: ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఏథర్ ఎనర్జీ శుభవార్తను అందించింది. తన ఎంట్రీలెవల్ 450 ఎస్ మాడల్ ధరను రూ.20 వేల వరకు తగ్గించినట్టు ప్రకటించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏథర్ 450 ఎస్ స్కూటర్ ధర బెంగళూరులో రూ.1,09,000కి తగ్గగా, అదే ఢిల్లీలో రూ.97,500కి దించింది.
దీంతోపాటు 450 ఎస్ప్రొ ప్యాక్ మాడల్‌ను సైతం రూ.25 వేలు దించింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. 2.9 కిలోవాట్ల బ్యాటరీ రీచార్జితో 115 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. కేవలం 3.9 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ గంటకు 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. బ్యాటరీపై ఐదేండ్లు లేదా 60 వేల కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయం కల్పిస్తున్నది.