Paytm-RBI | పేటీఎంపై ఆంక్షలు ఎందుకు విధించామంటే.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పిన వివరాలివి..!
Paytm-RBI | నిరంతరం నిబంధనలను ఉల్లంఘించినందువల్లే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆంక్షలు విధించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
Paytm-RBI | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’.. దాని అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిలెడ్ (పీపీబీఎల్)కు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు రెగ్యులేటరీ నిబంధనలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కానీ పరిస్థితి మెరుగు పడలేదన్నారు. బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థగా నిబంధనలను పాటించని సంస్థ ‘పేటీఎం’పై నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు. మూడు రోజులుగా జరిగిన ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా నిర్ణయాలను గురువారం శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పేటీఎం నిబంధనల ఉల్లంఘనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.
కొన్ని రోజులుగా ప్రజల నుంచి పలు ప్రశ్నలు తమకు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని వచ్చేవారం ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణతోపాటు వ్యవస్థలో సుస్థిరత లక్ష్యంగా తమ చర్యలు ఉంటాయన్నారు. రెగ్యులేటరీ నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ‘పేటీఎం’ ఒక సంస్థ మాత్రమేనని, మొత్తం ఫిన్ టెక్ సర్వీస్ రంగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
శక్తికాంత దాస్తోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే మాట్లాడుతూ పేటీఎం నిరంతరం నిబంధనలను ఉల్లంఘించడం వల్లే రెగ్యులేటరీ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కొన్ని నెలలు, కొన్ని సందర్భాల్లో ఏండ్ల తరబడి చర్చల తర్వాత ఆంక్షలు విధించినట్లు చెప్పారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు కొంత సమయం కూడా కేటాయించామన్నారు. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందు వల్ల ఫిబ్రవరి 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ రుణ పరపతి, టాపప్ రుణ పరపతి కల్పించరాదని ఆర్బీఐ గత నెల 31న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

