RBI – Web Series | సీరియళ్లు.. సినిమాలు.. అందరికీ వినోదంతోపాటు కాలక్షేపం కూడా.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత సీరియళ్లు.. సినిమాలతోపాటు వెబ్ సిరీస్లు వచ్చేశాయి.. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి తర్వాత వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యం పెరిగింది. ఆ వెబ్ సిరీస్ ల్లోకి వచ్చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). ఐదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తేవాలని ప్లాన్ చేసింది. సుమారు మూడు గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్’లో ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో వస్తోంది. దీనికో ప్రత్యేకత కూడా ఉంది.
1935లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఏర్పాటైంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ ఏర్పాటై 90 ఏండ్లు పూర్తయ్యాయి. 90 ఏండ్ల ఆర్బీఐ ప్రస్థానంలో కీలక విశేషాలను ప్రస్తావిస్తూ సాగుతుందీ వెబ్ సిరీస్. నేషనల్ టీవీ చానెల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం చేసేందుకు బిడ్లను ఆహ్వానిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను ఈ వెబ్ సిరీస్ లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణానికి ఆసక్తి గల నిర్మాణ సంస్థలు, టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది ఆర్బీఐ.
Ola Electric Motorbike | వచ్చే ఏడాది ఓలా ఈవీ మోటారు సైకిల్.. తెగేసి చెప్పిన భవిష్ అగర్వాల్..!
Realme Narzo N61 | రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో ఎన్61.. ఇవీ డీటెయిల్స్..!
Oppo K12x 5G | ఒప్పో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ.. ఇవీ డీటెయిల్స్..!