RBI MPC Meet | నవంబర్ 3న ఆర్బీఐ ద్రవ్య పరపతి అత్యవసర సమీక్ష?!
RBI MPC Meet | వచ్చేనెల మూడో తేదీన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనున్నది. ద్రవ్యోల్బణ నియంత్రణలో వైఫల్యాలపై ఈ భేటీలో చర్చిస్తారు.
RBI MPC Meet | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) సమావేశం నవంబర్ మూడో తేదీన జరుగనున్నది. ఆరు శాతానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో వైఫల్యాలకు కారణాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇంతకముందు సెప్టెంబర్ 28 – 30 మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5-7 తేదీల మధ్య జరుగాల్సి ఉంది. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇండ్ల రుణాలతోపాటు వివిధ రకాల లోన్లు పిరం అయ్యాయి.
ప్రధాన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ప్రాధాన్యం అని ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు శశాంక్ భిడే చెప్పారు. ఆహారం, ఇంధనంపై పరోక్ష ప్రభావం చూపే ద్రవ్యోల్బణంతోపాటు ఓవరాల్‌గా ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి 7.4 శాతం వద్దకు చేరుకున్నది. వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం ఆరు శాతానికి దిగి వస్తుందని శశాంక్ భిడే పేర్కొన్నారు. నవంబర్ మూడో తేదీన జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్ల పెంపుతోపాటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రెండో దశ చర్యలు తీసుకుంటారా.. లేదా.. అన్నది తేలాల్సి ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

