Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల భారం తగ్గుతుందని, ఈఎంఐలు దిగొస్తాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆర్బీఐ నిర్ణయానికి తగ్గట్టుగా బ్యాంకులూ వడ్డీరేట్లను తగ్గిస్తేనే పాత, కొత్త రుణగ్రహీతలకు లాభమన్న విషయాన్ని మరువద్దు. ఒకవేళ బ్యాంకులు కూడా తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది?
ఉదాహరణకు గృహ రుణాన్నే తీసుకుంటే..
రుణం : రూ.30 లక్షలు
కాలపరిమితి : 20 ఏండ్లు
మునుపటి వడ్డీరేటు : 8.50%
మారిన వడ్డీరేటు : 8.25%
పాత వడ్డీరేటుతో ఈఎంఐ : రూ.26,035
కొత్త వడ్డీరేటుతో ఈఎంఐ : రూ.25,562
నెలకు ఈఎంఐలో తగ్గేది : రూ.473
మొత్తం టెన్యూర్‌పై వడ్డీ లాభం : దాదాపు రూ.1.14 లక్షలు
గమనిక: వడ్డీరేట్లు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాన్ని ఈఎంఐలను తగ్గించడం ద్వారానైనా లేదా కాలపరిమితిని దించడం ద్వారానైనా బ్యాంకులు రుణగ్రహీతలకు అందిస్తాయి.