Mahesh Bank | దేశంలోనే ఫస్ట్ టైం.. సైబర్ సెక్యూరిటీ గాలికి.. మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ భారీ జరిమానా.. !
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ఇలా ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే ఫస్ట్ టైం.
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీపై హైదరాబాద్ నగర పెతాస్ సైబర్ క్రైమ్ వింగ్ పనితీరుకు అద్దం పట్టే చర్య వెలుగు చూసింది. ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్.. మహేశ్ బ్యాంక్.. సెబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ వింగ్ దర్యాప్తులో తేల్చింది. దీంతో మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది.
గతేడాది జనవరి 24న ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాలను నైజీరియాకు చెందిన హ్యాకర్ల ముఠా హ్యాక్ చేసి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించుకున్నది. దీనిపై మహేశ్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ భద్రతను మహేశ్ బ్యాంక్ యాజమాన్యం గాలికి వదిలేసిందని సైబర్ క్రైమ్ వింగ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసిన సైబర్ క్రైం వింగ్ పోలీసులు.. నైజీరియన్ హ్యాకర్ల ముఠాతోపటాు ఈ మోసంలో పాలు పంచుకున్న పలువురు వ్యక్తులను విచారించారు
నైజీరియన్ హ్యాకర్ల ముఠా.. మహేశ్ బ్యాంక్ సిబ్బందికి ఫిషింగ్ మెయిల్స్ పంపి.. సర్వర్ లోకి చొరబడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇదే అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దృష్టికి తీసుకెళ్లారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహేశ్ బ్యాంక్ లైసెన్సు రద్దు చేయాలని సూచించారు.
చట్టపరంగా ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాకపోవడంతో మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. సైబర్ భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే తొలిసారి అని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజల డబ్బు, కీలక డేటా చోరీ కాకుండా బ్యాంకులన్నీ సైబర్ సెక్యూరిటీ పద్ధతులు పాటించాలని సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cyber security
- Fine
- Mahesh Bank
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

