న్యూఢిల్లీ, డిసెంబర్ 8 : రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించగా..ఈ జాబితాలోకి మరిన్ని బ్యాంకులు చేరాయి. కొత్తగా ఈ జాబితాలోకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్లు చేరాయి.
వీటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేటు 8.30 శాతం నుంచి 8.55 శాతం మధ్యలోకి దిగొచ్చాయి. అంతకుముందు 8.35 శాతం నుంచి 8.60 శాతంగా ఉండేవి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రెపో లింక్డ్ లెండింగ్ రేటుని 10 బేసిస్ పాయింట్లు దించడంతో 8.35 శాతానికి దించింది.