వరదలా నగదు
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 7.8 శాతం, నోట్ల సంఖ్య 4.4 శాతం ఎగబాకాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) కరెన్సీ విలువ 9.9 శాతం, నోట్ల సంఖ్య 5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ తమ రిపోర్టులో పేర్కొన్నది.
- మార్కెట్లో పెరిగిన కరెన్సీ చలామణి
- విలువ 7.8%, నోట్లు 4.4% వృద్ధి
- 37.9% వాటా రూ.500 నోట్లదే
- 19.2 శాతంతో తర్వాతి స్థానంలో రూ.10 నోట్లు
- ఆర్బీఐ వార్షిక నివేదిక
ముంబై, మే 30: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 7.8 శాతం, నోట్ల సంఖ్య 4.4 శాతం ఎగబాకాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) కరెన్సీ విలువ 9.9 శాతం, నోట్ల సంఖ్య 5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ తమ రిపోర్టులో పేర్కొన్నది. ఇక రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా వాటిని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో మార్చుకోవచ్చని సూచించిన సంగతీ విదితమే. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల సంఖ్య 1.3 శాతం, విలువ 10.8 శాతం పడిపోయిందని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ నోట్లు 1.6 శాతం, విలువ 13.8 శాతం తగ్గిందన్నది. కాగా, 2021-22తో పోల్చితే 2022-23లో నోట్ల ఇండెంట్, సైప్లె 1.6 శాతం పెరిగింది. బీఆర్బీఎన్ఎంపీఎల్ ద్వారా 2,26,000 లక్షల నోట్లు, ఎస్పీఎంసీఐఎల్ ద్వారా 2,26,002 లక్షల నోట్ల ఇండెంట్, సైప్లె జరిగింది.
తొలగని నకిలీ నోట్ల సమస్య
గత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకింగ్ రంగంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో ఆర్బీఐ వద్ద 4.6 శాతం బయటపడగా, బ్యాంకుల్లో 95.4 శాతం దొరికాయని తాజా రిపోర్టులో తేలింది. ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం కొత్త డిజైన్ రూ.20, 500 నోట్లలో నకిలీ నోట్లు వరుసగా 8.4 శాతం, 14.4 శాతం చొప్పున పెరగడం గమనార్హం. అయితే రూ.10, 100, 2000 నకిలీ నోట్లు వరుసగా 11.6 శాతం, 14.7 శాతం, 27.9 శాతం మేరకు తగ్గాయని ఆర్బీఐ ప్రకటించింది.
సంస్కరణలపై ఒత్తిడి
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ దేశం వృద్ధిపథంలోనూ నడుస్తుందన్న ధీమాను ఆర్బీఐ వ్యక్తం చేసింది. అయితే నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మార్కెట్లలో మరింతగా ఒడిదుడుకులు ఏర్పడే వీలుండటం వంటివి నిర్మాణాత్మక సంస్కరణలపై ఒత్తిడిని పెంచుతున్నట్టు చెప్పింది. ఈ ప్రతికూల పరిస్థితులతో దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గవచ్చన్న ఆందోళననూ వెలిబుచ్చింది. గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7 శాతంగా నమోదు కాగలదన్న అంచనాను కనబర్చింది.
పెరిగిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్
గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 2.5 శాతం పెరిగింది. రూ.63.45 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం వరకు రూ.61.9 లక్షల కోట్లుగానే ఉన్నది. కాగా, 2022-23లో ఆర్బీఐ ఆదాయం 47.06 శాతం, వ్యయం 14.05 శాతం ఎగిశాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 794.63 మెట్రిక్ టన్నులు. నిరుడు మార్చి ఆఖర్లో 760.42 మెట్రిక్ టన్నులే. ఇదిలావుంటే విపత్తు సమయాల్లో క్లిష్టతరమైన లావాదేవీల కోసం లైట్ వెయిట్, పోర్టబుల్ పేమెంట్ వ్యవస్థల పరిచయానికి పనిచేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం బ్యాడ్ లోన్ ప్రొవిజనింగ్ కోసం ఓ సమర్థవంతమైన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆర్బీఐ వెలిబుచ్చింది.
ఆర్బీఐ వార్షిక నివేదిక ముఖ్యాంశాలు
- ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో అత్యధికంగా 37.9 శాతం వాటా రూ.500 నోట్లదే
- 19.2 శాతం వాటాతో రెండో స్థానంలో రూ.10 నోట్లు
- రూ.500 నోట్లు 5,16,338 లక్షలు ఉండగా.. వీటి విలువ రూ.25,81,690 కోట్లు. నిరుడు మార్చి ఆఖరుకల్లా చలామణిలో ఉన్న రూ.500 నోట్లు 4,55,468 లక్షలు
- రూ.500, రూ.2000 నోట్లు కలిసి చలామణిలో ఉన్న కరెన్సీలో 87.9 శాతానికి సమానం. ఏడాది క్రితం 87.1 శాతమే
- ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి చలామణిలో 4,55,468 లక్షల రూ.2000 నోట్లు. వీటి విలువ రూ.3,62,220 కోట్లు
- 2022-23లో ఈ-రుపీని పరిచయం చేసిన ఆర్బీఐ. మార్చి నాటికి చలామణిలో ఈ-రుపీ హోల్సేల్ విలువ రూ.10.69 కోట్లు. రిటైల్ విలువ రూ.5.7 కోట్లు
- ప్రస్తుతం చలామణిలో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లు. 50 పైసలు, రూ.1, 2, 5, 10, 20 నాణేలు
- 2022-23లో నోట్ల ముద్రణ ఖర్చు రూ.4,682.8 కోట్లు. 2021-22లో రూ.4,984.8 కోట్లు
- గత ఆర్థిక సంవత్సరం 4,824 లక్షల పాడైపోయిన రూ.2000 నోట్ల తొలగింపు.
- 2022-23లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో 13,530 మోసాలు. వీటి విలువ రూ.30,252 కోట్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- central bank
- FY24
- India
- money
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

