ఈసారీ వడ్డీరేట్లు ఎక్కడివక్కడే?
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, ఈసారీ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ తమ ద్రవ్య విధానాన్ని ప్రకటించవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
- నేటి నుంచి ఆర్బీఐ తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్ష
ముంబై, ఏప్రిల్ 2: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, ఈసారీ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ తమ ద్రవ్య విధానాన్ని ప్రకటించవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కరోనా సమయంలో దిగాలు పడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చేందుకు ఆర్బీఐ రెపోరేటును భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రెపోరేటును పెంచుకుంటూ పోయింది. ఫలితంగా ఇప్పుడిది 6.5 శాతంగా ఉన్నది. నిజానికి నిరుడు మే నెల నుంచి ఇది ఇలాగే ఉంటున్నది. ఈ క్రమంలో ఈసారి ద్రవ్య సమీక్షలోనూ ఈ రేటు ఇక్కడే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ద్రవ్యోల్బణం ఇంకా ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోకి దిగి రాకపోవడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల విధానం వంటివి ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే గతంలో మూడు నెలలకోసారి నిర్వహించిన ద్రవ్య సమీక్షను.. ఇప్పుడు రెండు నెలలకే చేపడుతున్నారు. దీంతో ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 6 సమీక్షలు జరుగుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో ఇవి ఉంటాయి. వడ్డీరేట్లు, నగదు చలామణి, ద్రవ్యోల్బణం, ఇతర స్థూల ఆర్థికాంశాలపై ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ చర్చిస్తుంది. మెజారిటీ సభ్యుల అంగీకారంతో నిర్ణయాలు వెలువడుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- financial year
- MPC
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

