Rapido | హైదరాబాద్, మే 22 : ర్యాపిడో.. తెలంగాణ వ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. ఇప్పటికే పలు నగరాల్లో రైడింగ్ సేవలను అందిస్తున్న సంస్థ..తాజాగా మరో 11 పట్టణాలకు ఈ సేవలను విస్తరించింది.
వీటిలో సిద్దిపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, నల్గొండ, రామగుండం, నిజామాబాద్, భువనగిరి, కొత్తగూడెం, సూర్యపేట్, ఆదిలాబాద్, కామారెడ్డి పట్టణాల్లో అతి తక్కువ ధరకే బైక్, ఆటోలను బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.