Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ముంబైకి చెందిన ఓ రైల్వే అధికారి (59)ని స్కామ్స్టర్లు ఏకంగా రూ. 9 లక్షలకు టోకరా వేశారు. బాధితుడు తన ఫోన్లో జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను జడ్జినని చెబుతూ నయవంచనకు తెరతీశాడు.
జీరో ప్రెస్ చేయకుంటే మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని తన ఫోన్‌కు మెసేజ్ రావడంతో బాధితుడు జీరో ప్రెస్ చేయగానే నిందితుల సూచనలకు అనుగుణంగా వీడియో కాల్ కనెక్ట్ చేశారు. ఆపై తాను సీబీఐ అధికారినని ఓ వ్యక్తి పరిచయం చేసుకుని బాధితుడిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైందని నమ్మబలికాడు. ఇక బాధితుడిని ఎవరినీ సంప్రదించే అవకాశం ఇవ్వకుండా గంటల తరబడి వీడియో కాల్లో ఉండేలా స్కెచ్ వేశారు.
ఆపై వీడియో కాల్‌లోనే స్కామర్లు ఫేక్ ఆన్లైన్ కోర్టు విచారణ చేపట్టారు. జడ్జిగా పరిచయం చేసుకున్న వ్యక్తి వీడియో కాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మనీల్యాండరింగ్ కేసును విచారించి క్లియర్ చేసేందుకు రూ. 9 లక్షలు తాము చెప్పిన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలని బాధితుడిని బెదిరించారు. స్కామర్ల ఒత్తిడి, బెదిరింపులతో బాధితుడు తన ఖాతా నుంచి స్కామర్లకు రూ. 9 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Mee Seva | స్తంభించిన ‘మీ’ సేవలు.. పది రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ