6-Airbags Cars | ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు కార్లలో సేఫ్టీ ఫీచర్లు పెరిగాయి. కార్ల కొనుగోలు దారుల్లోనూ సేఫ్టీ పట్ల అవగాహన రోజురోజుకు పెరుగుతున్నది. కారులోని ఫీచర్లన్నింటి కంటే కొనుగోలుదారులు సేఫ్టీకే ప్రియారిటీ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రయాణికుల సేఫ్టీకి కార్లలో 6-ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి అన్న ప్రచారాన్ని ఉధృతం చేసింది.
ఈ సేఫ్టీ పవనాలన్నీ కార్ల తయారీ దారులంతా తమ కొత్త మోడల్ కార్లలో 6-ఎయిర్‌బ్యాగ్స్ తయారీ వైపు మొగ్గడానికి కారణం అవుతున్నది. అన్ని కార్లలోనూ 6-ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరంటూ కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దేశంలో అందుబాటులో ఉన్న కార్లు, కొంగొత్తగా మార్కెట్లోకి రానున్న కార్లలో 6-ఎయిర్‌బ్యాగ్స్ వాడుతున్న మోడల్స్ గురించి తెలుసుకుందామా.. !
హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఇటీవలే గ్రాండ్ ఐ10 నియోస్ కారును న్యూ ఫేస్‌లిఫ్ట్ అప్డేట్తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.11 వేల పేమెంట్‌తో గ్రాండ్ ఐ10 నియోస్ న్యూ ఫేస్‌లిఫ్ట్ కారు బుక్ చేసుకోవచ్చు. న్యూ సెట్ ఆఫ్ బంపర్స్, న్యూ లార్జర్ గ్రిల్లె, స్వెఫ్ట్ బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కొత్తగా జత కలిశాయి. టైప్ సీ ఫాస్ట్ చార్జర్, టీపీఎంఎస్, 3.5- అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 82 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం గల 1.2-లీటర్ల పెట్రోల్ ఇంజిన్గల ఈ కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్ వాడుతున్నారు.
హ్యుండాయ్ ఔరా హ్యాచ్‌బ్యాక్ శ్రేణి కారు. ఇది కూడా ఫేస్‌లిఫ్ట్ అప్డేట్తో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. 6-ఎయిర్బ్యాగ్స్తోపాటు వైర్లెస్ చార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఎంఐడీ, ఇన్వర్టెడ్ `ఎల్` ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తదితర ఫీచర్లు కూడా జత కలిశాయి.
ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్పో-2023.. దేశీయ ఆటోమేకర్ల అభిరుచికి ప్రతిబింబంగా నిలుస్తున్నది. ఆయా బ్రాండ్ల నుంచి పలు కొత్త మోడల్ కార్లను చూశాం. ఆ జాబితాలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఉంది. 1.2-లీటర్ల పెట్రోల్ ఇంజిన్, ఆల్ట్రోజ్ ఐ-సీఎన్జీ విత్ యునిక్యూ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తున్నాయి. మార్కెట్లో ఆవిష్కరణ తేదీని టాటా మోటార్స్ ఇప్పటికైతే వెల్లడించలేదు. కానీ త్వరలో రోడ్లపైకి దూసుకు రానున్నాయి టాటా ఆల్ట్రోజ్ న్యూ మోడల్ కార్లు. సన్‌రూఫ్, న్యూ లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ చార్జర్‌తోపాటు సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్ జత కలుస్తున్నది.
మారుతి సుజుకి ఆఫ్‌లైన్ ఎస్యూవీ జిమ్నీ రెండు వేరియంట్లు.. జెటా, అల్ఫా రూపంలో వస్తున్నది. మార్కెట్ వర్గాలు, కార్ల ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ జిమ్నీని ఎట్టకేలకు ఎక్స్పో-2023లో మారుతి సుజుకి ఆవిష్కరించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 9.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, మిడ్ డిస్ప్లే, ఆల్ 4 పవర్ విండోస్ తదితర ఫీచర్లు జత కలిశాయి. రెండు వేరియంట్లలోనూ 6-ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్ తప్పనిసరి. ఎయిర్బ్యాగ్స్తోపాటు సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, లిమిటెడ్ స్లిప్ బ్రేక్ డిఫరెన్షియల్ తదితర ఫీచర్లు వస్తున్నాయి.
మారుతి సుజుకి అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ ఎస్యూవీ కారు బ్రెజా.. ఫ్యూయల్ ఎఫిషియెన్సీతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్-సీఎన్జీ వర్షన్‌నూ ఆవిష్కరించింది మారుతి సుజుకి. కే15సీ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. సీఎన్జీ మోడ్‌లో పని చేసే ఈ ఇంజిన్ 87 బీహెచ్పీ విద్యుత్, 121 ఎన్ఎం టార్జి వెలువరిస్తుంది. పెట్రోల్ మోడల్ కారులో కంటే సీఎన్జీ మోడ్ కారులోనే అధిక ఫీచర్లు వస్తున్నాయి. 6-స్పీడ్ ఏటీ టార్చి కన్వర్టర్ గేర్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫీచర్ గల తొలి ఎస్యూవీ కారు బ్రెజా.