హైదరాబాద్, జూన్ 20: ప్రీమియం కార్ల తయారీ సంస్థ పోర్షే..హైదరాబాద్‌లో మరో సెంటర్‌ను ప్రారంభించింది. 2,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్ దేశంలో అతిపెద్దది కావడం విశేషం.
రాష్ట్రంలో లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్‌ను ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సెంటర్లో కంపెనీ వాహన విక్రయాలతోపాటు సర్వీసింగ్, విడిభాగాలు కూడా విక్రయిస్తున్నది.