న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎండీ పాత్రా పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని గుప్తాతో భర్తీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్(ఏసీసీ) సమావేశమై గుప్తా నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం గుప్తా.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనమిక్ రీసర్చ్(ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.