న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)..ప్రత్యేకంగా రిటైల్ రుణ మేళా ‘పీఎన్బీ నిర్మాన్ 2025’ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 20 వరకు అందుబాటులో ఉండనున్న ఈ స్కీం కింద గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసిన బ్యాంక్…అలాగే డాక్యుమెంటేషన్ చార్జీలను మినహాయింపునిచ్చింది.
దీంతోపాటు గృహ రుణాలపై ఎన్ఈసీ, లీగల్, వాల్యుయేషన్ ఫీజులపై రాయితీ ఇచ్చింది. అదనపు ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా వాహన, గృహ, విద్యా రుణాలపై వడ్డీరేటుపై 5 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తున్నది కూడా.