నూఢిల్లీ, జూన్ 6: పీఎన్బీ వడ్డీరేట్లను అర శాతం తగ్గించింది. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన కొన్ని గంటల్లోనే రెపోతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది.
తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 9 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో పాత, కొత్తగా తీసుకునే రుణగ్రహీతలకు ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి.