Postal Insurance | జీవిత బీమా ఆకర్షణీయ రాబడులనూ అందిస్తే బాగుంటుంది కదూ. మనకు, మన కుటుంబ సభ్యులకు బీమా ధీమాతోపాటు చక్కని ఆర్థిక ప్రయోజనాలూ అందితే అంతకన్నా ఇంకేం కావాలి మరి. అయితే ఇలాంటి బెనిఫిట్స్, ఫీచర్లతోనే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) అందుబాటులో ఉన్నది. ఇదేదో నిన్నమొన్న పరిచయమైనది కాదు.. 141 ఏండ్ల చరిత్ర ఉన్నదీ బీమాకు. నిజానికి ఆరంభంలో తపాలా శాఖ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఓ సంక్షేమ పథకంగా మొదలైన పీఎల్ఐని.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి, సర్కారీ సంస్థల్లో కొలువులు చేస్తున్నవారికి వర్తింపజేశారు. కాలక్రమేణా వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏల వంటి ప్రొఫెషనల్స్‌తోపాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో నమోదైన కంపెనీల ఉద్యోగులకూ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గ్రాడ్యుయేట్లకూ పీఎల్ఐ సౌకర్యాన్ని పొడిగించారు. ఇక ఈ బీమాలోని పథకాల విషయానికొస్తే..
ఎంత చిన్న వయసులో బీమా తీసుకుంటే అంత తక్కువగా ప్రీమియంలు, ఎక్కువగా ప్రయోజనాలుంటాయన్నది మరువద్దు. ఇక పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలనుకొనేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్లు తమ పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాలసీనిబట్టి వివిధ వైద్య పరీక్షలూ ఉంటాయి.
గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. దీనికి గ్రామీణులు అర్హులు. అందులోనూ ఇలాగే రకరకాల స్కీములుంటాయి. ఆయా నిబంధనలూ వర్తిస్తాయి. మరిన్ని వివరాల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పోస్ట్ఇన్ఫో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు. అలాగే https://www.indiapost. gov.inను లాగిన్ కావచ్చు.