హైదరాబాద్, ఫిబ్రవరి 12: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.132.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ .212. 7 కోట్ల లాభంతో పోలిస్తే 37.75 శాతం తగ్గిందని పేర్కొంది.
ఫార్ములేషన్ ఎగుమతులు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.758.6 కోట్ల నుంచి రూ.474.8 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు రూ. 487.4 కోట్లకు తగ్గినప్పటికీ లా భాలు తగ్గుముఖం పట్టాయి. ఫార్ములేషన్ ఎగుమతులు రూ.605.6 కోట్ల నుంచి రూ.285.8 కోట్లకు తగ్గడం లాభాలపై ప్రతికూల ప్ర భావం చూపిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.