Petrol Rates – Goa | పెట్రోల్, డీజిల్‌లపై గోవా ప్రభుత్వం వ్యాట్ పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూపాయి, లీటర్ డీజిల్‌పై 36 పైసలు వ్యాట్ పెంచుతున్నామని, శనివారం నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ అండర్ సెక్రటరీ ప్రణబ్ బీ భట్ తెలిపారు. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ రూ.95.40, లీటర్ డీజిల్ రూ.87.90లకు లభిస్తుంది.
దీనిపై గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నేత యురి అలెమావో స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ప్రజా వ్యతిరేకం అని, తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెంచడానికి బదులుగా ప్రమోద్ సావంత్ ప్రభుత్వం తప్పనిసరిగా వృధా ఖర్చులు తగ్గిస్తే మంచిదని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ద్వారా సామాన్యుల వెన్ను విరవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని ఆరోపించారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచిన ప్రమోద్ సావంత్ సర్కార్.. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసిందని ధ్వజమెత్తారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవా శాఖ అధ్యక్షుడు అమిత్ పలేకర్ స్పందిస్తూ.. ‘ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల అవినీతి పెరుగుతుంది. విద్యుత్ చార్జీల తర్వాత పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచడం ద్వారా సామాన్యుల జేబులు కొల్లగొడుతున్నది’ అని ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉంటే, ఈ నెల 16న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది. లీటర్ పెట్రోల్ పై వ్యాట్ 25.92 శాతం నుంచి 29.84 శాతానికి, డీజిల్ పై 14.3 నుంచి 18.4 శాతానికి పెంచేసింది. తత్ఫలితంగా బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.84 నుంచి రూ.102.84లకు, డీజిల్ ధర రూ.85.93 నుంచి రూ.88.95లకు పెరిగింది. తాజాగా గోవా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై వ్యాట్ పెంచడం గమనార్హం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, గోవాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold-Silver Rates | భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ రిజర్వుపైనే ఆశలు..!