Personal Finance Tips | భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నారా? అయితే ఇలాంటి బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడమే బెటర్!
Personal Finance Tips | అతని సంపాదన అతనిది. అతని బ్యాంక్ అకౌంట్ అతనిది. ఆమె సంపాదన ఆమెది. ఆమె బ్యాంక్ అకౌంట్ ఆమెది. ఇద్దరికీ వారధి ఓ కుటుంబం అయినప్పుడు.. ఫ్యామిలీ కోసం ఓ జాయింట్ అకౌంట్ ఉండటమూ మంచిదే.
Personal Finance Tips | అతని సంపాదన అతనిది. అతని బ్యాంక్ అకౌంట్ అతనిది. ఆమె సంపాదన ఆమెది. ఆమె బ్యాంక్ అకౌంట్ ఆమెది. ఇద్దరికీ వారధి ఓ కుటుంబం అయినప్పుడు.. ఫ్యామిలీ కోసం ఓ జాయింట్ అకౌంట్ ఉండటమూ మంచిదే. ఇంటి అద్దె, పచారీ సామాన్లు, విద్యుత్ చార్జీలు, పనిమనిషి జీతం.. ఇలా ఇంటి ఖర్చులన్నీ ఆ ఖాతా నుంచే చెల్లించుకోవచ్చు. దీనివల్ల రూపాయి రాక-పోకలపై స్పష్టత ఉంటుంది. జీవిత భాగస్వామితో కలల్ని, లక్ష్యాల్ని పంచుకుంటున్నప్పుడు బ్యాంకు ఖాతాను మాత్రం పంచుకోకపోతే ఎలా? సంసార రథానికి ఇద్దరూ రెండు చక్రాలు కాబట్టి, ఆర్థిక వ్యవహారాల్లో కూడా సమ భాగస్వామ్యం అవసరం.
రాజారావ్ ఐటీ ఉద్యోగి. సుగుణ చార్టర్డ్ అకౌంటెంట్. ఇద్దరివీ క్షణం తీరికలేని ఉద్యోగాలే. అతను చూసుకుంటాడని ఆమె, ఆమెకు గుర్తుంటుందని అతను.. గడువు తేదీ పూర్తయినా కరెంటు బిల్లు చెల్లించరు. కొన్నిసార్లు ఒకరికి తెలియకుండా ఒకరు.. ఇంటి యజమానికి అద్దె డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. తీరా విషయం తెలిశాక.. ఒకర్నొకరు తప్పు పడతారు. కొన్నిసార్లు, నెలాఖరు నాటికి ఇద్దరి బ్యాంకు ఖాతాలూ జీరో బ్యాలెన్స్‌కు వచ్చేస్తాయి. సరుకులు నిండుకున్నా.. ఏ బిగ్ బాస్కెట్లోనో ఆర్డర్ చేసే పరిస్థితి ఉండదు. అలా అని ఇద్దరూ దుబారా మనుషులు కాదు. జాగ్రత్తగానే ఖర్చు చేస్తారు. మరి, ఎందుకిలా జరుగుతున్నది? కారణం.. సమన్వయ లోపం!కుటుంబ నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ తలనొప్పి. జాయింట్ అకౌంట్‌తో ఇలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి.
సమన్వయం లేకపోతే..
ప్రతి మనిషీ సంఘజీవి, ఆర్థిక జీవి కూడా. అతనికంటూ సంపాదన ఉంటుంది. తనవైన ఈఎమ్ఐలు, పొదుపు-మదుపు ప్రణాళికలు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వాయిదాలు, ఆరోగ్య బీమా ప్రీమియం.. వగైరా ఆర్థిక బాధ్యతలు ఉంటాయి. ఆ చెల్లింపులన్నీ బ్యాంకు ఖాతా నుంచి వెళ్లిపోతాయి. ఆ మాటకొస్తే.. ఆమె సంపాదన ఆమెకు ఉంటుంది. ఆమె ఆర్థిక బాధ్యతలూ ఆమెకు ఉంటాయి. మరి కుటుంబం సంగతి? అద్దె ఎవరు చెల్లించాలి? పవర్ బిల్లు ఎవరు కట్టాలి? సరుకులు ఎవరు తెప్పించాలి? బ్రాండ్‌బ్యాండ్ చార్జీలు ఎవరివి?.. ఇద్దరూ చెల్లించినా కష్టమే, ఇద్దరూ చెల్లించకపోయినా కష్టమే? వీకెండ్లో ఏ రెస్టారెంట్‌కో వెళ్లినప్పుడు.. ఎవరు ఖర్చు పెట్టాలి? ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ సున్నితమైన వ్యవహారం. ఆ క్షణానికి ఇద్దరి కార్డుల పరిమితీ పూర్తయిపోయి ఉంటే? ఇద్దరి బ్యాంకు ఖాతాలూ నిండుకుని ఉంటే? ‘ఫ్రెండ్ అడిగితే ఇచ్చేశాను. వాళ్లావిడ హాస్పిటల్లో ఉందట. డబ్బు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయమని చెప్పేశారట. అందుకే..’ అంటూ అతను నిజాయతీగానే సంజాయిషీ ఇవ్వవచ్చు. ‘పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బుల్లేవని మా తమ్ముడు బాధపడితే ఇచ్చేశాను. మీకు చెప్పాలనుకున్నా. పనిలో పడిపోయి..’ అంటూ ఆమె వాస్తవాన్ని వివరించవచ్చు. కానీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఆ విషయాలన్నీ చర్చించుకునే వరకూ.. బిల్లు కోసం వెయిటర్ అసహనంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఎంత నామోషీ? ఫ్యామిలీ జాయింట్ అకౌంట్‌తో ఇలాంటి లోపాలను సరిదిద్దుకోవచ్చు.
ఎవరో ఒకరు..
జాయింట్ అకౌంట్లో బ్యాంకు ఖాతా ఇద్దరి పేరూ మీదా ఉంటుంది. ఇద్దరూ తమ జీతాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని అందులో జమ చేస్తారు. ఇంటితో ముడిపడిన ప్రతి ఖర్చూ ఆ ఖాతా నుంచే చెల్లిస్తారు. ఇద్దరూ లావా
దేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది కూడా. అద్దె, సరుకులు, సినిమాలు, బిల్లులు.. సమస్తం ఇక్కడినుంచే. భార్యాభర్తలే కాదు.. కుటుంబ నిర్వహణలో పాలుపంచుకునే అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా జాయింట్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా జాయింట్ అకౌంట్ పనికొస్తుంది. ఖాతాలో ఎంత సొమ్ము ఉందన్నది ఇద్దరికీ తెలుస్తుంది కాబట్టి, ఆ మేరకే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. దుబారాకు ఆస్కారం ఉండదు. చివరి నిమిషపు షాక్స్ ఉండనే ఉండవు.
రకరకాలు
జాయింట్ అకౌంట్ ప్రారంభించడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ రెండు ఐచ్ఛికాలు ఉంటాయి. ‘మరియు’ అనే ఆప్షన్ ఎంచుకుంటే లావాదేవీ నిర్వహణకు ఇద్దరి సంతకాలు కావాలి. అదే, ‘ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా బతికున్నవారు’ అనే అప్షన్ ఎంచుకొంటే.. ఖాతాలోని ప్రతి భాగస్వామికీ విత్‌డ్రా అధికారాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఎవరైనా లావాదేవీలు నిర్వహించవచ్చు. దురదృష్టవశాత్తు, ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా.. మిగిలినవారికి ఆ ఖాతాలోని సొమ్ము మీద అధికారం ఉంటుంది. ఆలూమగల అనుబంధానికే కాదు.. జాయింట్ అకౌంట్‌కూ నమ్మకమే ప్రాణం. ఏ ఒక్కరు పారదర్శకంగా లేకపోయినా.. విశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడూ ఆ పరిస్థితి రాకూడదు. తెచ్చుకోకూడదు. అప్పుడే.. జాయింట్ అకౌంట్ అయినా, జీవితమైనా సజావుగా సాగుతాయి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Personal Finance Tips | కట్టిన ఇల్లు కొంటే లాభమా? కడుతున్నప్పుడే ఇంటిని బుక్ చేసుకుంటే బెటరా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

