ముంబై, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు పెరుగుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికులు 1.4 శాతం ఎగబాకి 16.77 కోట్లకు చేరుకున్నారని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.
అంతక్రితం ఏడాది 16.53 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని పేర్కొంది. దేశీయ ప్రయాణికులు అధికం కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు తగ్గుముఖం పట్టారు.