న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే గత మార్చిలో ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాల్లో కాస్త మెరుగుదల నమోదైంది. గత నెల రిటైల్ సేల్స్ 27.39 శాతం పెరిగి 2,79,745 యూనిట్లకు చేరాయి. కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన గతేడాది మార్చిలో 2,17,879 వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు విక్రయించాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) శుక్రవారం తెలిపింది.
మొత్తంగా ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ పెరిగినా టూ వీలర్స్ సేల్స్ పడిపోయాయి. దేశంలోని 1482 ఆర్టీవో ఆఫీసులకు 1277 ఆర్టీఓల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ల సమాచారం ప్రకారం.. ద్విచక్ర వాహన విక్రయాలు మార్చిలో 35.26 శాతం క్షీణించాయి. అంటే గతేడాది మార్చిలో టూ వీలర్స్ విక్రయాలు 11,95,445 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
ఇక వాణిజ్య వాహనాలు 42.2 శాతం తగ్గి 67,372కు, త్రిచక్రవాహనాల అమ్మకాలు 50.72 శాతం క్షీణతతో 38,034కు పడిపోయాయి. వ్యవసాయ వినియోగ ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 29.21 శాతం పెరిగి 69,082 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి విక్రయాలు 23,11,687 నుంచి 28.64 శాతం క్షీణతతో 16,49,678 యూనిట్లకు చేరాయి.
ఈ సందర్భంగా ఫాడా అధ్యక్షుడు వింకేశ్ గులాటీ మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారి సుమారు 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపింది. ఇంధనం, వాహనాల ధరలు పెరగడం వల్ల కూడా వాహనాల కొనుగోలు తగ్గింది’ అని వ్యాఖ్యానించారు.
కరోనా లాక్‌డౌన్‌తోపాటు గతేడాదే బీఎస్-4 ప్రమాణాల నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయడం కూడా వెహికల్స్ రిటైల్ సేల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయడానికి లాక్డౌన్ విధించే అవకాశాలు, సెమీ కండక్టర్లు, ఏబీఎస్ల కొరత ఏప్రిల్ నెలలో వాహనాల సేల్స్‌పై ప్రభావం ఉండొచ్చునని భావిస్తున్నారు.
ఏప్రిల్ నెలలో ఆటోమొబైల్స్ సంస్థలు ఆచితూచి ముందుకెళతాయని వింకేశ్ గులాటీ తెలిపారు. ఉగాది, గుడి పడ్వా, వైశాఖి, పైలా బోషాఖ్ తోపాటు వివాహాల సీజన్ వల్ల సేల్స్ పెరుగుతాయని ఫాడా వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్‌తోనూ పర్సనల్ లోన్.. అయితే!