Oppo Reno 12 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో రెనో11 ప్రో 5జీ ఫోన్ సేల్స్ భారత్ మార్కెట్లో గురువారం ప్రారంభం అయ్యాయి. ఒప్పో రెనో 12 5జీతోపాటు ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్లు గతవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ అమోలెడ్ డిష్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేర్ కెమెరాలు, పలు ఏఐ ఫీచర్లు ఉంటాయి. ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. భారత్ మార్కెట్లో రియల్మీ జీటీ 6టీ, ఐక్యూ నియో9 ప్రో, షియోమీ 14 సివి, శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్లతో ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.36,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.40,999లకు లభిస్తాయి. స్పేస్ బ్రౌన్, సన్ సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా వెబ్ సైట్ తోపాటు లీడింగ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, వన్ కార్డ్, కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీఎస్ బ్యాంకు కార్డులపై ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.4000 వరకూ ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. తొమ్మిది నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఈ నెల 18 అర్ధరాత్రి లోపు ప్రీ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆరు నెలల లోపు వన్ టైం స్క్రీన్ రీప్లేస్ మెంట్ సర్వీస్ అందిస్తోంది ఒప్పో. ఇక ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసే వారికి రూ.36,400 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14.1 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే హెచ్డీఆర్10+కు మద్దతుగా ఉంటుంది. ఔట్ డోర్స్‌లో 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది.
ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్5కేజేఎన్5 టెలిఫోటో సెన్సర్ విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్5కేజేఎన్5 కెమెరా ఉంటాయి. పలు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లతోపాటు ఫేస్ అన్ లాక్ ఫీచర్ కు మద్దతుగా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 80వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.