Oppo K12x | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో కే12ఎక్స్ (Oppo K12x) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ మేరకు ఒప్పో తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో ‘360 డిగ్రీస్ డామేజ్ ప్రూఫ్ ఆర్మౌర్ బాడీతో #OppoK12x5G ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ జూలై 29న ఆవిష్కరిస్తున్నాం’ అని తెలిపింది. ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్లు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఆన్ లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ 7.68 ఎంఎం ఆల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తోందని తెలుస్తున్నది. రెండు కలర్ ఆప్షన్లు – బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ రంగుల్లో లభిస్తుంది. 360-డిగ్రీ డామేజ్ ప్రూఫ్ ఆర్మౌర్ బాడీ ఫీచర్ కూడా జత చేసినట్లు ఒప్పో తెలిపింది. తడి చేతులతోనూ వాడేందుకు స్ప్లాష్ టచ్ ఫీచర్ ఉంటుంది. 45వాట్ల సూపర్ వూక్ ఫ్లాష్ చార్జర్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 120 హెర్ట్జ్ ఆల్ట్రా బ్రైట్ డిస్ ప్లే విత్ 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది. డిస్ ప్లేకు డబుల్ రీఇన్ ఫోర్సడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
ఒప్పో కే12 5జీ (Oppo K12x 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. 50-మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చర్ అండ్ ఆటో ఫోకస్, 2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్ అండ్ 82- డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంటది.
August Bank Holidays | ఆగస్టులో 13 రోజులూ బ్యాంకులకు సెలవులు.. కారణమిదే..!