Oppo F27 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది. 8 జీబీ ర్యామ్‌తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కంపెనీ కలర్ ఓఎస్ 14 స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ స్మార్ట్ ఫోన్. ఈ-కామర్స్ ప్లాట్పామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్సైట్లతోపాటు దేశంలోని రిటైల్ స్టోర్లలో మంగళవారం నుంచే ఫోన్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, వన్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్, 2100 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుందీ స్మార్ట్ ఫోన్. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రేర్ కెమెరాలు కంపెనీ హాలో లైట్ ఫీచర్ చుట్టు సర్క్యులర్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది.
ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్. ఈ బ్యాటరీ సింగిల్ చార్జింగ్ కావడానికి 44 నిమిషాలు పడుతుంది. బయో మెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ఉంటుంది.