Opec on Crude | భారీగా తగ్గిన క్రూడ్ ధర.. 5న వియన్నాలో ఒపెక్ ప్లస్ సదస్సు.. ఉత్పత్తి తగ్గింపే లక్ష్యం?
Opec on Crude | క్రూడాయిల్ ధర భారీగా తగ్గిన నేపథ్యంలో రోజువారీ ఆయిల్ ఉత్పత్తి తగ్గింపుపై 5న వియన్నాలో ఓపెక్+ దేశాలు చర్చించనున్నాయి.
Opec on Crude | నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి వివిధ దేశాలు వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. దీని ఫలితంగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళుతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న ఒపెక్ + దేశాలు క్రూడ్ ఆయిల్ ధర పతనంపై ఆందోళన చెందుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన వియాన్నాలో ఒపెక్ + దేశాల సదస్సు జరుగనున్నదని సంబంధిత వర్గాలు శనివారం తెలిపాయి.
అతి తక్కువ కాలంలో సదస్సు ఖరారు కావడంతో ఒపెక్+ దేశాల ప్రతినిధుల్లో కొందరు వర్చువల్గా హాజరవుతారని భావిస్తున్నారు. ఒపెక్ దేశాలతోపాటు రష్యా మిత్ర దేశాలతో కలిపి ఒపెక్ + అని పిలుస్తారు. మార్చిలో కొన్నేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రూడాయిల్ ధర భారీగా పతనమైంది. మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చిత పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతున్నది.
ఒపెక్ + దేశాలు ముడి చమురు ఉత్పత్తి తగ్గించడంపైనే చర్చలు సాగిస్తాయని సమావేశం దృష్టి సారిస్తాయని సమాచారం. మార్కెట్కు మద్దతుగా రోజు ఐదు లక్షల బ్యారెల్స్ ముడి చమురు ఉత్పత్తి తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. రష్యా మాత్రం పది లక్షల బీపీడీ క్రూడ్ తగ్గించాలని సూచిస్తుందని తెలియవచ్చింది. కానీ ఒపెక్ వర్గాలు మాత్రం ఐదు లక్షల బీపీడీ తగ్గింపునకు పరిమితం కావాలని భావిస్తున్నట్లు వినికడి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- crude oil
- opec
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

