Income Tax | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు (new tax regime) కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ (income tax) కట్టనక్కర్లేదని తెలిపింది.
కొత్తపన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఇలా ఉన్నాయి. మూడు లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి 5 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అదేవిధంగా రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 %, రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు 20 %, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం మేర పన్ను వర్తించనున్నట్లు విత్త మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచినట్లు స్పష్టం చేశారు.
#WATCH | On personal income tax rates in new tax regime, FM Sitharaman says, “Under new tax regime, tax rate structure to be revised as follows – Rs 0-Rs 3 lakh -Nil; Rs 3-7 lakh -5% ; Rs 7-10 lakh-10% ; Rs 10-12 lakh-15%; 12-15 lakh- 20% and above Rs 15 lakh-30%.” pic.twitter.com/zQd7A4OsnT
— ANI (@ANI) July 23, 2024
Also Read..
9 Priorities Of Budget | తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం