హైదరాబాద్, అక్టోబర్ 27: పుదుచ్చేరిలోనూ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీకి చెందిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సు సర్వీసులను లెప్ట్నెంట్ గవర్నర్ కైలాసనాథన్ ప్రారంభించారు.
ఈ బస్సులను 12 సంవత్సరాలపాటు నడిపించడంతోపాటు మెయింటెనెన్స్ చేయనున్నది. దీంతో దేశంలో 440 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించినట్టు అయింది.