న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఓలా క్యాబ్స్ తమ సేవలను విరమించుకున్నది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్వీసులను ఈ నెలాఖరుతో ఆపేయాలని సంస్థ నిర్ణయించుకున్నది. ఈ మేరకు ఓలా క్యాబ్స్ ప్రమోటర్ ఏఎన్ఐ టెక్నాలజీస్ మంగళవారం తెలియజేసింది. 2018లో దశలవారీగా ఈ దేశాల్లో ఓలా తమ క్యాబ్ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి విదితమే. కాగా, భారతీయ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయమని చెప్తున్నారు.