ఓలా అక్షయ తృతీయ ఆఫర్లు.. రూ50 వేలకు ప్రయోజనాలు కల్పించిన సంస్థ
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆదివారం కంపెనీ స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారు ఓలా సోనాను గెలుచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది.
వీటిలో జెన్ 3 ఎస్ఐ ఎక్స్(2 కిలోవాట్), రోడ్‌స్టర్ ఎక్స్(2.5 కిలోవాట్)ను కేవలం రూ.49,999కి కొనుగోలు చేయవచ్చు. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన స్కూటర్‌ను 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్‌తో తయారు చేసింది. అలాగే రోడ్‌స్టర్ ఎక్స్+ 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్‌కు రూ.50 వేలు రాయితీ ఇస్తుండటంతో ఈ బైకు ధర రూ.1,39,999కి దిగిరానున్నది. ఈ బైకుపై ఎనిమిదేండ్ల వ్యారెంటీని కూడా కల్పిస్తున్నది. వాహనాలపై రూ.40 వేల వరకు సంస్థ డిస్కౌంట్ ఇస్తుండగా, మరో రూ.10 వేలు ఈఎంఐ రూపంలో లభించనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

