Crude Oil | పెట్రో భారం తప్పదా.. అందుకు ఒపెక్ నిర్ణయమే కారణమా..?!
Crude Oil | సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. సౌదీ అరేబియా, రష్యాలతో కూడిన ఒపెక్ + కూటమి వచ్చే నెల నుంచి ప్రతిరోజూ 3.6 శాతం క్రూడ్ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడమే కారణమని తెలుస్తున్నది.
Crude Oil | దేశీయంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనున్నదా.. అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 1.81 డాలర్లు లేదా 2.4 శాతం ధర పెరిగింది. ఇంట్రా డే ట్రేడింగ్లో 78.93 డాలర్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి 77.94 డాలర్ల వద్ద స్థిర పడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 1.84 డాలర్లు లేదా 2.6 శాతం పెరిగింది. అంతర్గత ట్రేడింగ్లో 75.06 డాలర్ల గరిష్టానికి చేరుకుని 73.58 డాలర్ల స్థాయి వద్ద ముగిసింది. శుక్రవారం బ్రెంట్ క్రూడ్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కాంట్రాక్ట్ ధర కూడా రెండు శాతానికి పైగా పెరిగింది.
దీనికి ప్రపంచ దేశాలకు క్రూడాయిల్ ప్రధానంగా సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయమే కారణం. జూలై నుంచి ప్రతి రోజూ ఒక మిలియన్ బ్యారెళ్ల (పీడీడీ) ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియా తీర్మానించింది. అంతర్జాతీయంగా సూక్ష్మ ఆర్థిక సమస్యలకు తోడు మార్కెట్లలో మందగమనం నేపథ్యంలో క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించుకున్నది. గత నెలలో రోజుకు 10 మిలియన్ బీపీడీ క్రూడ్ ఉత్పత్తి చేసింది. వచ్చే నెల నుంచి తొమ్మిది మిలియన్ల బీపీడీకి తగ్గించాలని సౌదీనిర్ణయం తీసుకున్నది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా క్రూడాయిల్ ఉత్పత్తిలో కోత విధించడం ఇదే అత్యధికం.
సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఒపెక్ తోపాటు ఒపెక్ + కూటమిలో భాగస్వామిగా ఉన్న రష్యా సైతం వచ్చే ఏడాది నుంచి ముడి చమురు సరఫరాకు పరిమితి విధించాలని నిర్ణయం తీసుకోవడం దీనికి కారణం. క్రూడాయిల్ ధరల పతనానికి కళ్లెం వేయడానికే ఒపెక్ + దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ అవసరాల్లో 40 శాతం ఒపెక్ + కూటమి తీరుస్తున్నది. మొత్తం ప్రతి రోజూ 3.66 మిలియన్ బీపీడీల క్రూడ్ ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ + కూటమి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఇది గ్లోబల్ డిమాండ్లో 3.6 శాతంగా ఉండటం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- crude oil
- opec
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

