Offline Payments | వితౌట్ ఇంటర్నెట్.. ఆఫ్‌లైన్ పేమెంట్స్ ఇలా ఈజీ
Offline Payments | ఇంటర్నెట్ లేకున్నా దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ అమలులోకి తేవడానికి ఆర్బీఐ కసరత్తు చేస్తున్నది.

Offline Payments |కరోనా తర్వాత డిజిటల్.. ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి.. యుటిలిటీ బిల్లులు.. పచారీ కొట్టు బిల్లు కట్టాలన్నా.. ఆఖరుకు హోటల్లో భోజనం చేసినా.. టీ సేవించినా డిజిటల్ పేమెంట్స్.. అంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ సేవలను వినియోగిస్తున్నాం. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఫే చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాల్ఇసందే.. నెట్వర్క్ సరిగ్గా లేకుంటే డిజిటల్ పేమెంట్స్ జాప్యం కావడమే కాక ఒక్కోసారి బ్యాంక్ ఖాతాలో క్యాష్ డెబిట్ అయినా.. సదరు వ్యాపారి దరికి చేరట్లేదు. దీంతో వివాదాలు తలెత్తుతున్నాయి.
ఇలా ఆఫ్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్స్
దీనికి ఆర్బీఐ పరిష్కార మార్గాన్ని ఆవిష్కరించింది. ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్‌లైన్‌లోనే డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఆర్బీఐ అమలు చేసింది. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ సొల్యూషన్స్‌లో రూ.200 వరకే చెల్లింపులు పరిమితం చేసింది. సరాసరి రూ.48 మాత్రమే చెల్లింపులు జరిగాయి. పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది.
ఆఫ్‌లైన్ కోసం స్పెషల్ కార్డ్.. టోకెన్ జారీ
ఆఫ్‌లైన్ పేమెంట్స్ వినియోగించుకునే కస్టమర్లకు బ్యాంకులు గానీ, ఫిన్‌టెక్ సంస్థలు గానీ స్పెషల్ కార్డ్ లేదా టోకెన్ ఇస్తారు. ఇది డెబిట్ కార్డు మాదిరే ఉపయోగించొచ్చు. అయితే నిర్ణీత మొత్తంలోనే పేమెంట్ చేయాలి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) తరహాలోనే స్పెషల్ మిషన్ ద్వారా పేమెంట్స్ రిజిస్టర్ చేస్తారు.పీవోఎస్ మాదిరిగా ఆఫ్‌లైన్ పేమెంట్ మిషన్‌కు ఇంటర్నెట్తో అనుసంధానిం చాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ వచ్చినప్పుడు సదరు వ్యాపారి ఈ మిషన్‌ను అనుసంధానిస్తే పేమెంట్స్ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. ఇందులో వాయిస్ బేస్డ్ పేమెంట్స్ విధానం కూడా ఉంది. ఐవీఆర్ ద్వారా సూచనలతోనూ పేమెంట్స్ చేయవచ్చు.
ఫిన్‌టెక్ సంస్థలకు గుడ్ ఆప్షన్
దేశీయ డిజిటల్ పేమెంట్స్‌లో ఫిన్‌టెక్ స్టార్టప్‌లు ఎంతో ఆసక్తిగా సేవలందిస్తున్నాయి. ఆఫ్‌లైన్ పేమెంట్స్ అమల్లోకి వస్తే వీటికి మంచి అవకాశం కల్పించినట్లే. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రయోగాత్మక సేవలు ప్రారంభించాయి. స్పెషల్ కార్డులు జారీ చేయడం దగ్గర నుంచి యంత్రాల రూపకల్పనతో ఇంటర్నెట్ రాని ప్రాంతాలకు.. మరీ ముఖ్యంగా కొండలు, పర్యాటక ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తేవోచ్చు. అలాగే, ఈ పేమెంట్స్ విధానానికి జియో ట్యాగింగ్ చేయడంతో భద్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- offline payments
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

