హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌సింగ్ నేతృత్వంలోని బృందం శనివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు వివరించారు.
ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉన్నదని వెల్లడించారు. కాగా, ఎన్టీపీసీకి ప్రభుత్వం తరుఫున అన్ని విధాల సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.