న్యూఢిల్లీ, మే 24: విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ..గత త్రైమాసికానికిగాను రూ.6,490.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,871.55 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం ఎగబాకింది. ఏడాది క్రితం రూ.44,744.96 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..గత త్రైమాసికానికిగాను రూ.48,816.55 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3.25 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. తొలి విడుత ప్రకటించిన రూ.2.25 డివిడెండ్‌తోపాటు రెండోసారి ప్రకటించిన రూ.2.25 డివిడెండ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొత్తంగా 93.387 బిలియన్ యూనిట్ల(బీయూ) విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.