FASTag | జాతీయ రహదారులపై ఫాస్టాగ్ (FASTag) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టోల్ గేట్ల వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా, మోసాలు నివారించేలా తీసుకువచ్చిన ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
కొత్త రూల్స్ ప్రకారం. వాహనం టోల్ బూత్‌కు చేరడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయి ఉన్నా, హాట్‌లిస్ట్‌లో ఉన్నా, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ లావాదేవీ విఫలమవుతుంది. టోల్ బూత్ వద్ద స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాల వరకు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా లావాదేవీ తిరస్కరణకు గురవుతుంది. ఈ రెండు సందర్భాల్లో 176 ఎర్రర్ కోడ్‌తో లావాదేవీ విఫలమవుతుంది. ఇలా అయితే, వాహనానికి జరిమానా కింద రెట్టింపు టోల్ చార్జ్ పడుతుంది. ఈ రూల్స్‌కు అనుగుణంగా వాహనదారులు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. లేదంటే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం.
Also Read..
Virat kohli | బీసీసీఐ రూల్స్.. డైట్ ఫుడ్ కోసం విరాట్ కోహ్లీ తిప్పలు
Ayodhya | అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు.. కిక్కిరిసిన శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్
Nita Ambani | ప్రధాని మోదీ, ముకేశ్ అంబానీపై ర్యాపిడ్ ఫైర్ ప్రశ్న.. నీతా అంబానీ సమాధానం ఇదే