Paytm | పేటీఎంలో న్యూ ఫీచర్..ఇక థర్డ్ పార్టీ యాప్‌కూ మనీ ట్రాన్స్ఫర్ ఈజీ
Paytm | థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈజీగా మనీ బదిలీ చేయొచ్చు. పేటీెెెెఎం తన యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది.
Paytm | మీ మొబైల్ నంబర్ నుంచి మీరు పేటీఎం ( Paytm ) ద్వారా ఇతర పేమెంట్స్ యాప్స్‌కు నేరుగా మనీ పంపొచ్చు. అటువంటి ఫెసిలిటీ తీసుకొచ్చిన యాప్‌గా పేటీఎం నిలిచింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకే యాప్ లేకున్నా ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ పేటీఎం తీసుకు వచ్చింది. ఈ సేవలు పొందడానికి పేటీఎం యాప్‌లో `యూపీఐ మనీ ట్రాన్స్ఫర్` సెక్షన్లోకి వెళితే `టూ యూపీఐ యాప్స్` విభాగం కనిపిస్తుంది. మీరు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి వాడే యాప్‌లోకి వెళ్లి ఆ వ్యక్తి మొబైల్ నంబర్ నమోదు చేయొచ్చు. అటుపై `పే నౌ` ఆప్షన్ టాప్ చేసి మీరు పంపాల్సిన మనీ వివరాలు ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే సరి.
ఇప్పటి వరకు యాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కేవలం నాలుగు ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది క్యూఆర్ కోడ్ స్కాన్, రెండవది యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్ ఆధారంగా డబ్బు బదిలీ చేయడానికి ఇద్దరు యూజర్లు ఒకే ప్లాట్‌ఫామ్ వాడుతుండాలి. బ్యాంకు ఖాతా వివరాల సాయంతో ఇతర యాప్స్‌కు పంపొచ్చు.
దేశీయంగా పేమెంట్స్ యాప్స్ ట్రాన్సాక్షన్లలో పేటీఎం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఫోన్‌పే, రెండో స్థానంలో జీ-పే నిలిచాయి. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ నిరంతరాయంగా పెరుగుతున్నాయి. గత నెలలో యూపీఐ పేమెంట్స్ ద్వారా 730 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వాటి విలువ రూ.12.11 లక్షల కోట్ల పైమాటే. అంతకుముందు సెప్టెంబర్‌లో రూ.11.16 లక్షల కోట్ల విలువ గల 678 కోట్ల లావాదేవీలు రికార్డు అయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

