గురువారం 04 జూన్ 2020
Business - May 10, 2020 , 19:09:12

యోనో ద్వారా అత్యవసర రుణాలు ఇవ్వం

యోనో ద్వారా అత్యవసర రుణాలు ఇవ్వం

ముంబై: యోనో ప్లాట్‌ఫాం ద్వారా తమ ఖాతాదారులకు అత్యవసర రుణాలు అందజేస్తున్నట్టు వస్తున్న వార్తను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని, యోనో డిజిటల్‌ సర్వీస్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఎలాంటి అత్యవసర రుణాలు ఇవ్వడం లేదని స్పష్టంచేసింది. 10.5 శాతం వడ్డీతో రూ.5లక్షల వరకు అత్యవసర రుణాలు కేవలం45 నిమిషాల్లోనే అందజేస్తున్నదని, ఈ రుణాలకు సంబంధించిన ఈఎంఐలు ఆరు నెలల తర్వాత  ప్రారంభమవుతాయని పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి  వదంతులను నమ్మవద్దని తమ ఖాతాదారులను ఎస్బీఐ కోరింది. కొవిడ్‌-19 నేపథ్యంలో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఊరట కల్పించేందుకు త్వరలో యోనో ప్లాట్‌ఫాం ద్వారా ప్రీ-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్లను అందుబాటులో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.


logo