Nokia India : పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే ప్రణాళికలతో ముందుకెళుతున్న నోకియా కీలక నిర్ణయం తీసుకుంది. నోకియా ఇండియా నూతన అధిపతిగా తరుణ్ ఛబ్రాను కంపెనీ నియమించింది.
చబ్రా ఇప్పటివరకూ నోకియాలో మొబైల్ నెట్వర్క్స్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఇక చబ్రా భారత్లో నోకియా కార్యకలాపాలకు సారధ్యం వహించనున్నారు. సంజయ్ మాలిక్ స్దానంలో నోకియా ఇండియా హెడ్ బాధ్యతలను తరుణ్ చబ్రా స్వీకరించనున్నారు.
మార్కెట్ పరిస్ధితులకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని, నిర్వహణా సామర్ధ్యం పెంచుకునే క్రమంలో వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడాలని నోకియా నిర్ణయించింది. ఇక ఛబ్రా నియామకాన్ని నోకియా ఇండియా ధ్రువీకరించింది. ఏప్రిల్ 2024 నుంచి ఛబ్రా నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది.
Read More :